Nov 05,2020 23:37

ఎస్‌ఐకి వినతిపత్రం అందిస్తున్న ఐద్వా నాయకులు

పిఎం.పాలెం : ప్రేమ పేరుతో అమ్మాయిలను నమ్మించి సంవత్సరాల తరబడి తిరిగాక సంబంధం లేదు పొమ్మని మోసగించిన రాజశేఖర్‌, శ్రీనివాస్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, సహాయ కార్యదర్శి వై.సత్యవతి, డాక్టర్‌ ప్రియాంక, పుష్పాంజలి దిశా పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ పాపారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లండ రాజశేఖర్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లుగా లక్ష్మితో తిరుగుతూ ఇప్పుడు రూ.ఐదు లక్షల కట్నానికి ఆశపడి మేనకోడలితో వివాహానికి సిద్ధపడ్డాడని వివరించారు. లక్ష్మి కంచరపాలెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా వివాహం ఆగిందని, రాజశేఖర్‌ జైలుకు వెళ్లోచ్చిన తర్వాత కోర్టు స్టే తెచ్చుకుని సచివాలయంలో ఉద్యోగం చేసుకుంటున్నాడని తెలిపారు. మోసగాళ్లు విచ్చలవిడిగా తిరుగుతుంటే ఏ అమ్మాయికి న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. మరో యువకుడు శ్రీనివాస్‌ ఐదేళ్లు విజయతో తిరిగి పెళ్లి చేసుకొని నేడు సంబందం లేదని వేరే వివాహానికి సిద్ధపడుతున్నాడని తెలిపారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.