
గణపవరం(పశ్చిమగోదావరి): వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే 3 వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం కేశవరం సెంటర్లో మహిళా రైతులు ముగ్గులు వేస్తూ నిరసన తెలిపారు. రైతు నిలబడాలి.. వ్యవసాయం కావాలి.. అంటూ ముగ్గులు వేశారు. మోడీ వల్ల రైతులకు సంక్రాంతి ఆనందం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాల్లో వెలుగు లేకుండా చేసిన మోడీ విధానాలు నశించాలి అన్నారు. పండుగల్లో తమ ముంగిళ్ళలో రంగవల్లులుతో ముగ్గులు వేసి ఆనందపడే తమకి ఈరోజు రైతు నిలబడాలని వ్యవసాయం కావాలని ముగ్గులు వేసి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జుత్తిగ అంజలి, వేండ్ర సత్యవతి శ్రీదేవి, పెచ్చెట్టి నిహారిక, శ్రీదేవి, వాహిని, వెంకటలక్ష్మి, జుత్తిగ సౌమ్య, తదితరులు పాల్గొన్నారు.