Nov 28,2020 01:16

అచ్యుతాపురం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఆందోళన చేస్తున్న రైతులు, రైతు నాయకులు

అచ్యుతాపురం : స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ఎపి రైతు సంఘం ఆధ్వర్యాన రైతులు ఆందోళన చేపట్టారు. తొలుత అచ్యుతాపురం జంక్షన్‌ నుంచి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కర్రి అప్పారావు మాట్లాడుతూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. సోమనాధన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కరోనా కాలంలో నెలకు పదివేల రూపాయలు, పది కేజీల బియ్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ రామ సదాశివరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.రాము, మండల కార్యదర్శి కె.సోమునాయుడు, రైతు సంఘం ప్రతినిధులు శరగడం అప్పలనాయుడు, ఎల్లపు ఆదిబాబు, శరగడం రామునాయుడు పాల్గొన్నారు.
అనకాపల్లి : అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యాన పట్టణంలోని ఆర్‌డిఒ, ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎఐకెఎస్‌సిసి జిల్లా కన్వీనర్‌ అజరు కుమార్‌, కోకన్వీనర్‌ బాలకృష్ణ, రాష్ట్ర ప్రతినిధి బాలు గాడి, రైతు సంఘం జిల్లా నాయకులు వైఎన్‌.భద్రం, సిఐటియు నాయకులు పెంటకోట శ్రీనివాసరావు, చేతివృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు గంటా శ్రీరామ్‌, సిపిఐ నాయకులు మల్ల మాధవరావు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.దొరబాబు, సహకార రైతు వేదిక నాయకులు కె.సురేష్‌ బాబు మాట్లాడారు. ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేశారు.
సబ్బవరం : ఆర్‌ఇసిఎస్‌ ఎఇ అశోక్‌ కుమార్‌కు రైతు సంఘం నాయకులు ఉప్పాడ సత్యవతి, మొల్లేటి గౌరీశ్వరరావు వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించరాదని, పాత విద్యుత్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ కోరారు.
నాతవరం : రైతాంగానికి నష్టం చేసే విద్యుత్‌ సంస్కరణలు, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, గురువారం ఢిల్లీలో రైతులపై కేంద్ర ప్రభుత్వం చేసిన లాఠీఛార్జిని ఖండిస్తూ రైతు సంఘం, సిపిఎం ఆధ్వర్యాన స్థానిక సబ్‌ స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జెఇకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ విదేశీ, దేశీ కార్పొరేట్లకు మేలు చేసే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే, వాటికి పార్లమెంట్‌లో వైసిపి, టీడీపీ మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. సిపిఎం నాయకులు పి.చిన్నా, గంగరాజు, నాగమణి పాల్గొన్నారు.
దేవరాపల్లి : వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని, విద్యుత్‌ సంస్కరణలు ఆపాలని, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే ఆలోచన విరమించుకోవాలని శుక్రవారం రైతు సంఘం, సిపిఎం ఆధ్వర్యాన దేవరాపల్లి ఎలక్ట్రికల్‌ ఎఇకి వినతి పత్రం సమర్పించారు. సిపిఎం నాయకులు డి.వెంకన్న, రొంగలి దేముడునాయుడు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఇ.నరసింహమూర్తి, రైతులు జె.సన్నిబబాబు, కె.కన్నంనాయుడు, వి.పైడంనాయుడు పాల్గొన్నారు.
ఎపిఇపిడిసిఎల్‌ కార్యాలయం ఎదుట
సీతమ్మధార : నగరంలోని ఎపిఇపిడిసిఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యాన నిరసన తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, సిఐటియు నగర ఉపాధ్యక్షులు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లు కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడాన్ని ఆపాలని కోరారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జి.నాయనబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, నాయకులు కృష్ణారావు, శ్రీనివాస్‌, అప్పారావు, ఆర్‌పి.రాజు పాల్గొన్నారు.
రైతులకు మద్దతుగా సిఐటియు నిరసన
గాజువాక : రైతులకు మద్దతుగా గాజువాక విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సిఐటియు నాయకులు ఎం.రాంబాబు, డి.రమణ, ఎన్‌.రాజేంద్రప్రసాద్‌, బి శ్రీను, కిరీటం, సంతోషం, లక్ష్మి, సత్యనారాయణ పాల్గొన్నారు.
ములగాడ : సిఐటియు మల్కాపురం జోన్‌ కమిటీ ఆధ్వర్యాన స్థానిక విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద నిరసన కార్యక్రమం చేశారు. సిఐటియు నాయకులు ఆర్‌.లక్ష్మణమూర్తి, టి.అప్పారావు, బిఎస్‌ఆర్‌.మూర్తి, ఎం.కృష్ణారావు, సాయిరాం, గోపి, జగదీష్‌, పుణ్యవతి పాల్గొన్నారు.
కంచరపాలెం : సిఐటియు కంచరపాలెం జోన్‌కమిటీ ఆధ్వర్యాన స్థానిక ఎలక్ట్రికల్‌ ఎఇ ఆఫీస్‌ వద్ద నిరసన తెలిపారు. సిఐటియు జోన్‌ కార్యదర్శి ఒ.అప్పారావు, ఎస్‌.సోమేశ్వరరావు, పి.దామోదర్‌, ఎన్‌.మోహన్‌, పి.పూర్ణ, వరలక్ష్మి, శ్రీను, కారి అప్పారావు పాల్గొన్నారు.
ఆరిలోవ : సిఐటియు ఆరిలోవ జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్‌ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సంఘం జోన్‌ కార్యదర్శి వి.నరేంద్ర కుమార్‌, నాయకులు ఐసి.నాయుడు, కనకమహాలక్ష్మి, రమణమ్మ, ఆటో యూనియన్‌ నాయకులు, జివిఎంసి కార్మికులు పాల్గొన్నారు.