Nov 22,2020 12:11

ఫ్రాంక్‌ఫర్ట్‌ : ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్న మోడెర్నా సంస్థ రూపొందిస్తున్న వాక్యిన్‌ ధరను ఆ సంస్థ ప్రకటించింది. టీకా ఒక్కో డోసుకు ప్రభుత్వాల నుంచి 25 డాలర్ల నుంచి 37 డాలర్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని ఆ సంస్థ సిఇఒ స్టిఫానీ బాన్సెల్‌ తెలిపారు. మూదో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో వాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైందని ఆ సంస్థ ప్రకటించడంతో వ్యాక్సిన్‌ కొనుగోలుకు ఇప్పటికే పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. గత సోమవారం ఐరోపా సమాఖ్య (ఇయు) మోడెర్నాతో ప్రత్యేకంగా చర్చలు జరిపి.. 25 డాలర్ల కంటే తక్కువకు ఇస్తే మిలియన్ల డోసులు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే ఇంకా ఒప్పందం ఖరారు కాలేదని చెప్పారు. త్వరలోనే ఐరోపా ప్రజలకు వాక్సిన్‌ అందించడంపై సానుకూల ప్రకటన వెలువడే అవకాశం ఉంన్నారు. మొదటి, మధ్యంతర విశ్లేషణలో భాగంగా 94.5 శాతం సమర్ధతతో వ్యాక్సిన్‌ పనిచేసినట్లు వెల్లడించారు.