Nov 12,2020 20:59

టీవల ప్రముఖ ఆన్ లైన్ గేమ్ ... ప్లేయర్స్ వార్ గ్రౌండ్ (పబ్-జి)  భారత్ నుండి పూర్తిగా వైదొలగుతున్నట్లు ప్రకటించింది.  ఇక పై పబ్-జి గేమ్ భారత్ లో అందుబాటులో ఉండదని కూడా తెలిపింది. అంతేకాదు, సర్వర్లను కూడా నిలిపివేసింది. అయితే, పబ్-జి అభిమానులకు తాజా వార్త ఏమిటంటే... పబ్-జి మొబైల్ ఇండియాను పబ్-జి కార్పొరేషన్ భారతదేశంలో త్వరలో అధికారికంగా ప్రారంభించనుంది. దీని కొత్త వెర్షన్ పేరు... ‘పబ్-జి మొబైల్ ఇండియా’. ఈ కొత్త వెర్షన్ ను భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.  దీని విడుదల తేదీని కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ మేరకు  పబ్-జి కార్పొరేషన్ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది.