Sep 14,2021 13:24

హైదరాబాద్‌ :   సింగరేణి కాలనీలో అత్యాచారానికి గురైన చిన్నారి ఘటనపై హీరో మంచు మనోజ్‌ స్పందించారు. మంగళవారం ఉదయం సింగరేణి కాలనీకి చేరుకున్న ఆయన.. చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యంత క్రూరత్వమైన చర్య ఇదని అన్నారు. క్రూరమైన సమాజంలో బతుకుతున్న మనమంతా బాధ్యతాయుతంగా ఉండాలని, ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పించాలని అన్నారు. ఇప్పటికీ నిందితుడి జాడ దొరకలేదని పోలీసులు అంటున్నారని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాగా, చత్తీస్‌గఢ్‌లో మూడేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష వేయాలని ఏడాది తర్వాత తీర్పు వచ్చిందని, ఇలాంటి రాక్షసులను 24 గంటల్లో ఉరి తీయాలని మంచు మనోజ్‌ డిమాండ్‌ చేశారు. పాపలేని లోటును మేం ఎవరం తీర్చలేమని, చిన్నారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని, న్యాయం జరిగేవరకూ పోరాడతామని, ఇలాంటి లోకంలో మనం బతుకుతున్నందుకు బాధగా ఉందని, ఇకనుండైనా మగాడి ఆలోచనలు మారాలని అన్నారు