Jun 13,2021 16:57

ప్రజాశక్తి- ఎమ్మిగనూరు

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్కులర్ 172 ప్రకారం మన ఊర్లో 1 నుండి 5 తరగతుల వరకు కొనసాగుతున్న బడి కనుమరుగయ్యే అవకాశం ఉంది కనుక "మన ఊరి బడిని మనం నిలబెట్టుకుందాం - మన పిల్లల్ని మన బడిలోనే చదివించుకుందాం" అని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యన్. నాగమణి జిల్లా అధ్యక్షుడు జె.ఎల్లప్ప పిలుపునిచ్చారు. స్థానిక ప్రాంతీయ కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండేళ్ల నుంచి మనబడిలో చాలా మార్పులు వచ్చాయి నాడు-నేడు పనులతో మన బడులు చూడముచ్చటగా మారాయి విద్యా కానుకగా బడి సంచీలో పిల్లలకు కావల్సినవన్నీ ఇచ్చారు. బడికి పిల్లలు పంపుతున్నందుకు తల్లికి 15000 అమ్మ ఒడికి ఇచ్చారు. దీంతో మన బడుల్లో పిల్లలు బాగా పెరిగారు. ప్రభుత్వముమీరు, మేము కలిసి మన ఊరి బడిని కళకళలాడేలా చేసుకున్నాము. ఇప్పుడు ప్రభుత్వం ఎల్ కేజీ యూకేజీ చదువులు కూడా మనబడిలోకి తెస్తామంటుంది. దీంతో మనబడి మరింత బలపడుతుంది. కానీ మన బడి నుంచి 3,4,5 తరగతుల పిల్లల్ని దూరంగా ఉండే హైస్కూల్ కు పంపుతామంటున్నారు. ఇప్పటిదాకా ఐదు తరగతులున్న  బడిలో 1,2 తరగతులు మాత్రమే ఉంచుతారు. అంటే మనబడి రూపమే మారిపోతుంది. పదేళ్ల లోపు పిల్లలు కూడా మన వాడ వదిలి, ఊరు వదిలి, ఇప్పటిదాకా చదువుతున్న బడి వదిలి వెళ్లాలి అన్నమాట ఇంటి దగ్గర బడి వదిలేసి మైళ్ల దూరం నడవాలి అన్న మాట. ఇది ఇది పిల్లలకు చాలా కష్టమవుతుంది బడి మానేస్తారే ఏమోనని మాకు భయం వేస్తుంది. హైస్కూల్లో పెద్ద పిల్లలు ఉంటారు వాళ్లతో ఈ చిన్న పిల్లలు కలవడం కష్టమవుతుంది. దేశంలో ఇలా ఎక్కడా లేదు. కనుక మనమందరం కలిసి "మన ఊరి బడిలోనే మన పిల్లలు చదువుకునేలా మన ఊరి బడిని మనం కాపాడుకోవాలని" తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. యుటిఎఫ్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు మీరు పనిచేస్తున్న గ్రామాలలోకి వెళ్ళి పాఠశాల కమిటి చైర్మన్లు, వార్డు మెంబర్లకు, గ్రామ సర్పంచులకు, తల్లిదండ్రులకు కరపత్రాలు, రెప్రంజెంటేషన్ ఇచ్చి మన ఊరిబడిని మనం కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో యం.నాగరాజు, దావీదు, రాఘవేంద్ర, కౌలన్న, రామాంజినేయులు, చిన్నయల్లప్ప, యం.రాజు, బాబు, కె.రాజు తదితరులు పాల్గోన్నారు.