Nov 29,2020 12:34

మచిలీపట్నం(కృష్ణా): మంత్రి పేర్ని నానిపై ఆయన ఇంట్లోనే ఆదివారం హత్యాయత్నం జరిగింది. ఓ దుండగుడు తాపీతో దాడి చేయడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న మంత్రి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో పేర్నినానికి తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రిని కలవడానికి వచ్చిన వ్యక్తి తొలుత ఆయన కాళ్లకు దండం పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఒక్కసారిగా తాపీని తీసి దాడికి యత్నించాడు. అక్కడే ఉన్న అనుచరులు అడ్డుకున్నారు. దాడికి యత్నించిన వ్యక్తిని బడుగు నాగేశ్వరరావుగా గుర్తించారు. పోలీసులకు అప్పగించారు. ఇతను మద్యం మత్తులో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.