
హైదరాబాద్ : హెరిటేజ్ కేసులో మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు శుక్రవారం విచారించి ఈ మేరకు వారికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కన్నబాబు, అంబటి రాంబాబు ఈరోజు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే వారు కోర్టుకు హాజరు లేదు. దీంతో వచ్చే వాయిదాకు కచ్చితంగా రావాల్సిందేనని పేర్కొంటూ నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎంపిలు, ఎమ్మెల్యేలపై కేసులు ఉంటే.. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.