Mar 02,2021 21:39

ప్రభుత్వ కార్యాలయాల వద్ద మద్యం బాటిళ్లు

ప్రజాశక్తి- రైల్వేకోడూరు :పట్టణంలోని ఎంపిడిఒ కార్యాలయం ఆవరణంలో వివిధ శాఖల కార్యాలయాలు ఉన్నాయి. కానీ ఎంపిడిఒ కార్యాలయం కిటికీల వద్ద కాళీ మందు బాటిల్లు దర్శనమిస్తున్నాయి ప్రతిరోజు రాత్రివేళ మద్యం ప్రియులు ఈ ప్రాంగణంలో మద్యం సేవించి బాటిల్‌ అక్కడే పడ వేస్తు న్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే సిబ్బంది కూడా అక్కడే మద్యం సేవిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఎవరైనా సరే ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రాంగణంలో మద్యం సేవించడం విచారకరం సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని పలువురు కోరుతున్నారు.