May 18,2021 22:14

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి -కర్నూలు హాస్పిటల్‌: కరోనా పేషెంట్లకు మండల కేంద్రంలో ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని సిపిఎం కల్లూరు మండల కార్యదర్శి కె.వెంకట్రాముడు డిమాండ్‌ చేశారు. మంగళవారం తహశీల్దార్‌ టివి.రమేష్‌ బాబును కలసి ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం కల్లూరు మండల కార్యదర్శి కె. వెంకట రాముడు మాట్లాడుతూ పట్టణాలకు పరిమితమైన వైరస్‌ ఇప్పుడు గ్రామాలను పట్టిపీడిస్తుందని తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రజలకు ప్రభుత్వాలు మంచి పౌష్టికాహారం, మెడికల్‌ కిట్లు ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి రూ.7500 నెలకు ఇచ్చి నిత్యవసర వస్తువులు 17 రకాలు ఇంటింటికి ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ప్రతి తాలూకా కేంద్రంలో ఆక్సిజన్‌తో కూడిన 100 బెడ్స్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సిపిఎం మండల నాయకులు ఎం.హరిబాబు, నాయకులు గోపీనాథ్‌, షేక్షావలి, రమణ గౌడ్‌ పాల్గొన్నారు.