Mar 05,2021 18:58

ప్రజాశక్తి - నరసాపురం
నరసాపురం పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున మంచు తెరలు అలముకోవడంతో ఆహ్లాదకర వాతారణం నెలకొంది. దీంతో ఆ సుందర దృశ్యాలను చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పది రోజులుగా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో తెల్లవారుజామున గోదావరి నదీతీరాన వ్యాయామం చేయడానికి వస్తున్న వారు ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.