Oct 28,2021 20:22

హీరో సుమంత్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ కాన్సెప్ట్‌ తో 'మళ్లీ మొదలయ్యింది' చిత్రంతో సందడి చేయనున్నాడు. టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నైనా గంగూలీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ట్రైలర్‌ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. విడాకుల తర్వాత ఒక యువకుడి జీవితంలో జరిగే అవమానాలు, అపార్ధాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. కొన్ని విభేదాల వల్ల భార్యతో విడిపోయిన విక్రమ్‌ .. భార్య తరుపున వాదించే లాయర్‌ ప్రేమలో పడతాడు. ప్రేమ, పెళ్లితో మళ్లీ కథ మొదటికి వస్తుంది. ఈ నేపథ్యంలో సాగిన కథలో సన్నివేశాలు వినోదాత్మకంగా, ఎమోషనల్‌గా చూపించారు. చివర్లో మంజుల ఘట్టమనేని స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా కనిపించి సందడి చేశారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

'మళ్లీ మొదలైంది' ట్రైలర్‌

https://youtu.be/cvjSH0l9VdA