Jun 13,2021 07:56
  • దేశవ్యాప్తంగా మరో 84వేలకు పైగా కరోనా కేసులు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో, అమరావతి బ్యూరో : గత మూడు నాలుగు రోజులుగా మూడు వేలకు పైగా నమోదవుతున్న కరోనా మరణాలు తాజాగా నాలుగువేలు దాటాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాక శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం శుక్రవారం ఉదయం నుండి 24 గంటల్లో 4,002 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,67,081కి చేరింది. గత 24 గంటల్లో దేశ వ్మాప్పంగా 19,20,477 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 84,332 కొత్త కేసులు వెలుగుచూశాయి.
    మొత్తం కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో 1,21,311 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 2.79 కోట్ల మందికిపైగా వైరస్‌ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రికవరీ రేటు 95.07 శాతానికి చేరగా, క్రియాశీల రేటు 3.68 శాతానికి తగ్గింది. క్రియాశీల కేసులు 10 లక్షలకు పడిపోయాయి. మరోవైపు గత 24 గంటల్లో 34.3 లక్షల వ్యాక్సిన్‌ డోసులు అందించినట్టు దీంతో మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 25 కోట్ల మార్కుకు చేరినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 6,952 మందికి
   రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 1,08,616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,952 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణైంది. 58 మంది కరోనా లక్షణాలతో చనిపోయారు. మరో 11,577 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 91,417 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతు న్నారు. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరులో 1199, తూర్పుగోదావరిలో 1167 కేసులు నమోదు కాగా అత్యల్పంగా నెల్లూరులో 228, విజయనగరంలో 249, కర్నూల్లో 251 కేసులు నమోదయ్యాయి. ప్రకాశంలో 11 మంది, చిత్తూరులో తొమ్మిది, తూర్పుగోదా వరిలో ఆరుగురు, అనంతపురం, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురేసి, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురేసి, కర్నూల్లో ముగ్గురు, గుంటూరు, విజయనగరంలలో ఇద్దరేసి, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 11,882కు చేరిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించిన బులిటెన్‌లో పేర్కొంది.