
తిరువనంతపురం : మలబార్ ఎక్స్ప్రెస్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేరళలోని తిరువనంతపురం జిల్లా వర్కాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సరకు రవాణా చేసే బోగిలో మంటలు చెలరేగాయి. కాగా, ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టమూ జరిగినట్లు సమాచారం లేదు. ప్రయాణికులు మంటలను వెంటనే గుర్తించి గార్డుకు సమాచారం అందించారు. దీంతోపాటు వేగానికి మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా చైనులాగి రైలును ఆపేశారు. ప్రస్తుతం ఎడవా గ్రామం వద్ద రైలు ఆగి ఉంది. మంటలను ఆర్పేందుకు రైల్వే అధికారులు, ప్రయాణికులు ప్రయత్నాలు చేస్తున్నారు.