Mar 02,2021 23:32

ఆలయ ఇఒకు చెక్కు అందిస్తున్న రాజశేఖర్‌రెడ్డి దంపతులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి మూలవిరాట్‌కు అలంకరిం చేందుకు సిద్ధం చేస్తున్న బంగారు మకర తోరణానికి హైదరాబాద్‌కు చెందిన మలిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఆయన సతీమణి దీప్తిలు రూ.లక్ష చెక్కును విరాళంగా అందజేశారు. మంగళవారం రాజశేఖరరెడ్డి దంపతులు అరసవల్లి సందర్శించారు. వివిధ సేవలలో పాల్గొన్న అనంతరం ఆలయ ఈఒ వి.హరిసూర్యప్రకాష్‌ను కార్యాలయంలో కలుసుకొని చెక్కును అందజేశారు. విద్యుత్‌శాఖ ఉద్యోగులు అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయాన్ని విద్యుత్‌ ఉద్యోగులు సందర్శించారు. విజయవాడ నుంచి వచ్చిన విద్యుత్‌శాఖ ఉద్యోగులు జి. సురేష్‌కాంత్‌ రెడ్డి, ఆర్‌. రమేష్‌బాబు, ఆలయాన్ని సందర్శించారు.