Oct 28,2021 20:16

మలయాళ స్టార్‌ టోవినో థామస్‌ నటించిన 'మిన్నల్‌ మురళి' అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా నెట్‌ ఫ్లిక్స్‌ ట్రైలర్‌ ను విడుదల చేసింది. థామస్‌ డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆయన సూపర్‌ హీరోగా కనిపించనున్నారు. ప్రముఖ డిజిటల్‌ ఫ్లాట్‌ నెట్‌ ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌ ఓటీటీ విధానంలో ఈ సినిమా విడుదలవుతోంది. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 24న ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందని మేకర్స్‌ ప్రకటించారు. బేసిల్‌ జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. 'బెంగుళూరు డేస్‌' చిత్రాన్ని నిర్మించిన సోఫియా పాల్‌, ఈ సినిమాని వీకెండ్‌ బ్లాక్‌ బస్టర్స్‌ బ్యానర్‌ పై నిర్మించారు.

'మిన్నాల్‌ మురళి' ట్రైలర్‌ విడుదల

https://youtu.be/zAUAliz1TKA