Oct 27,2021 23:05

ప్రజాశక్తి - గన్నవరం : మిజోరాం గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబు బుధవారం హైదరాబాద్‌ నుండి ఇండిగో విమానంలో గన్నవరం చేరుకున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నరు రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సిపి బత్తిన శ్రీనివాసులు, నూజివీడు ఆర్‌డిఒ కె.రాజ్యలక్ష్మి, ఏడిసిపి లా అండ్‌ ఆర్డర్‌ ఎం.రామకష్ణరాజు, ఎయిర్పోర్ట్‌ డైరెక్టర్‌ పి.వి.రామారావు, తహసీల్దార్‌ నరసింహారావు పాల్గొన్నారు.