Oct 12,2020 19:09
మీ కళ్లను, నోటిని మూసుకోకండి

నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినా.. మహిళలపై జరిగే అత్యాచారాలు, లైంగిక వేధింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌ హత్రాస్‌ జిల్లాలో 19 ఏళ్ల మనీషా సామూహిక అత్యాచారానికి గురై మరణించింది. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన చెందిన ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ఫేమ్‌ నటి శయాని గుప్తాలు తమదైన శైలిలో స్పందించారు.

హథ్రస్‌ సామూహిక అత్యాచార ఘటన గురించి ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ఫేమ్‌ నటి శయాని గుప్తా తనదైన శైలిలో స్పందించారు. అక్టోబర్‌ 2 గాంధీ జయంతి సందర్భంగా షారుఖ్‌ ఖాన్‌ ఒక ట్వీట్‌ చేశారు. అందులో 'ఈ సమయంలో మన పిల్లలకు ఒకే ఆదర్శం బోధించాలి. అది ఏంటంటే మంచి, చెడు అన్ని వేళలా పిల్లలు చెడు వినకూడదు... చూడకూడదు.. మాట్లాడ కూడదు. 151వ జయంతి సందర్భంగా గాంధీ విలువలను స్మరించుకోవాలి' అంటూ పోస్ట్‌ చేశారు.


ఈ ట్వీట్‌కు శయానీ ఘాటుగా రీట్వీట్‌ చేసింది. అందులో 'చెడు మాట్లాడొద్దు సరే.. చెడు గురించి మాట్లాడాలి కదా!'. 'సే సంథింగ్‌ ది రైట్‌ థింగ్‌. నిజాన్ని నిలబెట్టేందుకు నోరెత్తమని కూడా గాంధీజి చెప్పారు. బడుగు వర్గాలు, దళిత సోదరులు, దళిత అక్కాచెల్లెళ్లు.. వీళ్లపై జరుగుతున్న దౌర్జన్యాలపై గళం విప్పమని అదే గాంధీజి చెప్పారు. మీ కళ్లను, నోటిని మూసుకోకండి... సత్యం కోసం మాట్లాడండి' అని షారుఖ్‌కు గట్టిగానే చెప్పింది. ప్రస్తుతం శయానీ, షారుఖ్‌ల ట్వీట్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయంపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. సీనియర్‌ నటుడితో మాట్లాడుతున్నా అని కూడా లేకుండా ఏదంటే అది మట్లాడిందని కొందరు చర్చ లేవనెత్తు తున్నారు. మరి కొందరు నువ్వు చాలా ధైర్యంగల స్త్రీవి అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దేశంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నా పెద్దపెద్ద సెలిబ్రిటీలు నోరెత్తకుండా ఉండటం సబబు కాదు.