Mar 02,2021 21:43

సదస్సులో మాట్లాడుతున్న యుటిఎఫ్‌ నాయకులు జానకీరావు

సాలూరు: సమాజ ంలో మహిళలపై పెరుగుతున్న దాడులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అని శ్రామిక మహిళా జిల్లా కార్యదర్శి వి.ఇందిర అన్నారు. మంగళవారం బాగువలస పిహెచ్‌సి ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆశా, సామాజిక ఆరోగ్య కార్యకర్తల సమావేశంలో ఇందిర మాట్లాడుతూ మహిళలపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయన్నారు. మహిళా చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రెండో ఎఎన్‌ఎంల సంఘం నాయకులు వై.వెంకటలక్ష్మి, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల సంఘం నాయకులు జె.భారతి, పి.విజయ, ఎం.సంతు, గిరిజన సంఘం నాయకులు వి.సుందరరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
తోణాంలో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తోణాం పిహెచ్‌సి ఆవరణలో ఆశా, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల సమావేశం జరిగింది. కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండల అధ్యక్షుడు కె.జానకీరావు మాట్లాడుతూ మహిళలపై లైంగిక దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో తోణాం పిహెచ్‌సి హెచ్‌వి విమల, ఆశా కార్యకర్తల సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి.రమణమ్మ, కె.సరోజిని కె.మరియమ్మ, ఎం.తవిటమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్వైనాయుడు పాల్గొన్నారు.