Nov 30,2020 20:01

ఫొటో : మాట్లాడుతున్న వెటర్నరీ డాక్టర్‌ జె చంద్రమోహన్‌

ఫొటో : మాట్లాడుతున్న వెటర్నరీ డాక్టర్‌ జె చంద్రమోహన్‌
మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం
ప్రజాశక్తి-కొడవలూరు : పొదుపు మహిళల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వెటర్నరీ డాక్టర్‌ జె.చంద్రమోహన్‌ పేర్కొన్నారు. విడవలూరు మండలం సంఘబంధం కార్యాలయంలో పొదుపు మహిళలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్‌ చంద్రమోహన్‌ మాట్లాడుతూ ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయూత నుంచి మహిళలకు రూ.75 వేలు, 'తోడు' చిరు వ్యాపారస్తులకు రూ.10 వేలు ఇచ్చిందన్నారు. చేయూత నుంచి పొదుపు మహిళలు అభివృద్ధి చెందేలా పాడే బర్రెలు, గొర్రెలు కొనుగోలు చేసి పొదుపు మహిళను అభివృద్ధి చేసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎన్నో పథకాలు చేపడుతున్నారని తెలిపారు.
కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్‌ శ్రీహరి, ఎపిఎం హరి, సంఘ బంధం అధ్యక్షురాలు కవిత, సిసిలు హరి, శివ, శైలజ, శ్యామలమ్మ, మస్తానమ్మ, విఒఎలు, పొదుపు సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.