Jun 11,2021 10:50

ముంబయి : బీహార్‌లో కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య పునరుద్ధరించినట్లే... మహారాష్ట్ర కూడా ఆ దిశగా చర్యలు చేపట్టింది. దీంతో రాష్ట్రంలో మరో 1,522 మరణాలు వెలుగుచూశాయి. తాజాగా 393 కొత్త కేసులు గురువారం నమోదయ్యాయి. దీంతో మొత్తంగా రాష్ట్రంలో 1,03,748 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా మరణాల్లో రాయ్గఢ్‌లో అత్యధికంగా 61 మంది మరణించగా, మీరా-భయాందర్‌లో 33 మంది కోల్హాపూరల్‌ 27 మందిని కరోనా బలితీసుకుంది. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... పునరుద్ధరించిన మరణాల సంఖ్య 1,522లో 573 మంది థానే, పూణెలో 244, నాసిక్‌లో 86 మంది మరణించారు. కోవిడ్‌ మరణాలను నవీకరించడంలో ఆలస్యం జరుగుతున్న ఆరోపణ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోపే... రెండు రోజుల్లో మరణాల సంఖ్యను పునరుద్ధరించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ఆసుపత్రిలోని సివిల్‌ సర్జన్లకు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్‌ 18,2020 నుండి మే 2021 మధ్య 11,617 మంది మరణించారని వార్తా కథనాలు తరువాత ఆయన ఈ ప్రకటన చేశారు. అయితే ఈ సంఖ్యను కోవిడ్‌ పోర్టల్‌లో ఇంకా నవీనీకరించలేదు.