Dec 05,2021 19:47

ముంబయి/జైపూర్ : మహారాష్ట్ర, రాజస్తాన్‌లో మరో 16 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 21కి చేరింది. నైజీరియాలోని లగోస్‌ నుండి గత నెల 24న 44 ఏళ్ల మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి... భారత్‌లోని పింప్రీ-చించ్వాద్‌ మున్సిపల్‌ ప్రాంతానికి వచ్చి తన సోదరుడ్ని కలిశారు. దీంతో కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా.. మొత్తం ఆరుగురికి ఒమిక్రాన్‌ అని నిర్ధారణైంది. కాగా, పూణెకు చెందిన మరో 47 ఏళ్ల వ్యక్తికి కూడా ఈ వైరస్‌ బారిన పడ్డట్లు నేషనల్‌ కెమికల్‌ లేబరేటరీ రిపోర్టుల్లో తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్‌ బారిన పడ్డ వారి సంఖ్య ఎనిమిదికి చేరుకున్నాయి. జైపూర్‌లో మరో 9 మంది ఒమిక్రాన్‌ బారిన పడ్డారు.