Oct 27,2021 22:34

మెరుగైన వైద్యసేవలందించండి
ప్రజాశక్తి -నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రసూతి మరణాలు సంభవించకుండా మెరుగైన వైద్య సేవలను సకాలంలో అందించాలని వైద్యాధికారులకు కలెక్టర్‌ కెవిఎన్‌ చక్రధర్‌ బాబు అధికారులను సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ప్రసూతి మరణాల నివారపై ఆయన ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 2021 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు సంభవించిన 10 ప్రసూతి మరణాలపై సంబంధిత వైద్యులు, సిబ్బందితో చర్చించారు. ప్రసూతి మరణాలకు గల కారణాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు అవసరమైన అన్నిరకాల వైద్య సేవలను క్రమం తప్పకుండా అందిస్తూ తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ప్రసూతి మరణాలను తగ్గించాలన్నారు. జాయింట్‌ కలెక్టర్లు గణేష్‌ కుమార్‌, రోజ్‌ మాండ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ దినేష్‌ కుమార్‌, డిఎంహెచ్‌ఓ రాజ్యలక్ష్మి, అడిష నల్‌ డిఎంహెచ్‌ఓ స్వర్ణలత ఉన్నారు.