
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీని శ్రీనగర్లో మళ్లీ గృహనిర్బంధంలో ఉంచినట్లు ఆమె కుమార్తె ఇల్టిజా ముఫ్తీ శుక్రవారం తెలిపారు. దక్షిణ కాశ్మీర్లోని పుల్వామాలో పార్టీ నేత వహీద్ పర్రా కుటుంబాన్ని సందర్శించడానికి తన తల్లికి అనుమతి ఇవ్వలేదని ఆమె అన్నారు. మరోవైపు ముఫ్తీ నిర్బంధంలో లేరని కాశ్మీర్ జోన్ పోలీలు ప్రకటన చేశారు. కేవలం భద్రతా కారణాల దృష్ట్యా పూల్వామా పర్యటనను పూర్తిగా వాయిదా వేయాలని మాత్రమే అభ్యర్థించినట్లు తెలిపారు.
పిడిపి యూత్ వింగ్ ప్రెసిడెంట్ పర్రాను రెండు రోజుల పాటు ప్రశ్నించిన తర్వాత ఉగ్రవాదానికి సంబంధించిన కేసులో ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. పుల్వామా నుంచి డిడిసి ఎన్నికల్లో పర్రా నామినేషన్ వేశారు. వహీద్ పర్రాను నిరాధార ఆరోపణలపై అరెస్టు చేసినట్లు ముఫ్తీ ఆరోపించారు.