Apr 14,2021 20:22

తాజాగా రాధికా ఆప్టే మెగా ఫోన్‌ పట్టింది. హర్రర్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'స్లీప్‌వాకర్స్‌' అనే చిత్రానికి దర్శకత్వం వహించింది రాధికా. 'స్లీప్‌వాకర్స్‌'లో షహానా గోస్వామి, గుల్షన్‌ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. పామ్స్‌ స్ప్రింగ్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రాధికా తాను దర్శకత్వం వహించిన 'ది స్లీప్‌వాకర్స్‌' ట్రైలర్‌ను విడుదల చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధికా మాట్లాడుతూ.. ''నేనెప్పుడూ దర్శకురాలిగా మారాలనుకోలేదు. హనీ ట్రెహాన్‌, అభిషేక్‌ చౌబేలకు కథ చెప్పినప్పుడు వారు దాన్ని చేయాలనుకున్నారు. కథ రాయడం అయిపోయాక దర్శకత్వం వహించాలనుకున్నా. దర్శకత్వం చేయడం నాకు బాగా నచ్చింది' అంటూ చెప్పుకొచ్చింది రాధికా.