Oct 27,2021 23:41

రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న శివరామిరెడ్డి

ప్రజాశక్తి -సోంపేట రూరల్‌: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా బుధవారం సోంపేట పోలీస్‌ స్టేషన్‌ వద్ద హృదయం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని డిఎస్‌పి శివరామిరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరంలో యువత, ఆటో డ్రైవర్లు 60 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో సిఐ డివివి సతీష్‌కుమార్‌, బారువ ఎస్‌ఐ రమేష్‌, హృదయం ఫౌండేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.