Oct 27,2021 22:32

మేయర్‌కు స్వాగతం పలుకుతున్న కమిషనర్‌

ప్రజాశక్తి-కాకినాడ ఇటీవల కాకినాడ నగర మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సుంకర శివప్రసన్నకు మునిసిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ బుధవారం స్వాగతం పలికారు. బుధవారం కార్పొరేషన్‌ పాత కార్యాలయంలోని మేయర్‌ ఛాంబరులో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క బహుకరించి శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండో డిప్యూటీ మేయర్‌ చోడిపల్లి ప్రసాద్‌, అడిషనల్‌ కమిషనర్‌ సిహెచ్‌.నాగ నరసింహారావు, మేనేజర్‌ కె.సత్యనారాయణ పాల్గొన్నారు.