Apr 27,2021 20:55

వాషింగ్టన్‌ : దేశంలో కరోనా సృష్టిస్తున్న విలయంపై ప్రఖ్యాత టెక్‌ దిగ్గజం యాపిల్‌ స్పందించింది. క్షేత్రస్థాయిలో కరోనా నివారణకు జరగుతున్న కృషికి తన వంతు సాయం చేస్తానని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ సిఒఓ టిమ్‌కుక్‌ విడుదల చేసిన ప్రకటనలో ' భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ భయంకరమైన మహమ్మారితో పోరాడుతున్న ప్రతి ఒక్కరిచుట్టూ మా ఆలోచనలు తిరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సహాయ చర్యలకు మద్దతుగా యాపిల్‌ విరాళం ఇవ్వనుంది.' అని ఆయన ట్వీట్‌ చేశారు. అయితే, ఎంతమొత్తంలో విరాళం ఇవ్వనున్నారన్న విషయమై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే గూగల్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు భారత్‌కు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.