
అడివి శేష్ ప్రస్తుతం ... వీర మరణం పొందిన మేజర్ ఉన్ని కృష్ణన్ బయోపిక్‌ను పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా శేషు మీడియాతో మాట్లాడారు. 'మేజర్ ఉన్ని కృష్ణన్‌ని చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఆయనపై వచ్చిన ప్రతి వార్తనూ భద్రంగా దాచుకున్నా, ఆయన్ని ఓ సోదరుడిలా భావించా' అన్నారు. ఆయన తల్లిదండ్రుల సహకారంతో ఈ సినిమా తీస్తున్నామని చెప్పారు. త్వరలోనే చిత్రం ఫస్టలుక్ని విడుదల చేస్తామని చెప్పారు. ఈ చిత్రాన్ని నటుడు మహేష్‌బాబు, ఇండియన్ సినీ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు.