Jan 17,2021 11:29

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య' సినిమాలో హీరో రామ్‌ చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆచార్య నుంచి రామ్‌ చరణ్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. చరణ్‌ ఎన్నడూ లేని విధంగా మెడలో రుద్రాక్ష, చెవికి పోగుతో కొత్త లుక్‌లో కనపడుతున్నాడు. 'సిద్ధా' అనే పాత్రలో ఆయన నటిస్తున్నాడని చిత్ర యూనిట్‌ తెలిపింది. 'ఆచార్య' సెట్‌లోకి ఆయనకు స్వాగతం పలుకుతున్నామని చెప్పింది. ''మా సిద్ధా సర్వం సిద్ధం'' అంటూ ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ కూడా ఈ పోస్టర్‌ను పోస్ట్‌ చేశారు. కాగా, ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్‌ నటిస్తోంది. ఈ సినిమాను కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.