Dec 04,2021 03:11

విద్యార్థులతో కలిసి సహ ఫంక్తి భోజనం చేస్తున్న రామరాజు

ప్రజాశక్తి - సబ్బవరం : మండల కేంద్రంలోని సబ్బవరం అగ్రహారం పాఠశాలలో ఎండిఎం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రామరాజు మధ్యాహ్న భోజనం అమలును శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని అన్ని పాఠశాలలనూ ఎంఇఒ, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ సందర్శించాలన్నారు. పాఠశాలల్లో వంటశాల ప్రదేశాలను, స్టాక్‌ స్టోర్‌ రూమ్‌, ఎండిఎం రిజిస్టర్‌, డ్రై రేషన్‌, ఆక్విటేన్స్‌ రిజిస్టర్లను పరిశీలించి ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహఫంక్తి మధ్యాహ్న భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వి.దేవనాధబాబు, తదితరులు పాల్గొన్నారు.