Sep 24,2021 01:40

కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌ఐ సన్నిబాబు

యలమంచిలి : మండలంలో పలు చోట్ల మద్యం, గూట్కా కేసులు నమోదయ్యాయి. వాటి వివరాలను రూరల్‌ ఎస్‌ఐ సన్నిబాబు గురువారం విలేకరులకు వివరించారు. పోతిరెడ్డిపాలెం గ్రామం వద్ద రూ.6 వేలు విలువజేసే గుట్కా, పొగాకు పదార్థాలను ఇత్తంశెట్టి మనోజ్‌కుమార్‌ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఏటికొప్పాక గ్రామంలో తీట గంగరాజు వద్ద ఆరు మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. పోతిరెడ్డిపాలెం శివారులో జుట్టుక భద్రం నుంచి ఆరు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.