Oct 27,2021 22:42

మాట్లాడుతున్న ఎంపిపి

ప్రజాశక్తి-ఆళ్లగడ్డ రూరల్‌ : మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని ఎంపిపి గజ్జల రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని ఎంపిపి కార్యాలయంలో గ్రామాలో మౌలిక వసతులపై ఎంపిపి గజ్జల రాఘవేంద్ర రెడ్డి ఎంపిడిఒ, ఎపిఒ, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అధికారులు కృషి చేయాలన్నారు. శాసనమండలి విప్‌ గంగుల ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిల సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇన్‌ఛార్జి ఎంపిడిఒ వెంకటేశ్వరరావు, ఎపిఒ గణేష్‌, పంచాయతీ సెక్రటరీలు, యాదవాడ నరసింహారెడ్డిలు పాల్గొన్నారు.