- దూదేకుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బాబన్
ప్రజాశక్తి - నంద్యాల క్రైం: నంద్యాలలో మైనార్టీ కుటుంబం సమస్య సద్దుమణగకముందే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో షాహిదా అత్యాచార, హత్య సంఘటన జరగడం ఘోరమని, నిందితులను శిక్షించాలని నంద్యాల దూదేకుల సంఘం నాయకులు కోరారు. శుక్రవారం సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఖాసీం, డిడి జ్యువెలర్స్ యజమాని దస్తగిరి ఆధ్వర్యంలో డాక్టర్ బాబన్ నూర్ నర్సింగ్ హోమ్ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబన్ మాట్లాడారు. రాబోవు కాలంలో ఇలాంటి తప్పుడు పనులు చేయాలంటే భయపడే విధంగా నిందితులను శిక్షించాలని కోరారు. నూర్ బాష, పర్ల దస్తగిరి, బాబు, ఆదాం, రసూల్, హసన్, డిజిటల్ దస్తగిరి పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ బాబన్