Oct 14,2021 20:49

అమరావతి: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధిన సమాచారం బస్తర్‌ పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బీజాపూర్‌ అడవుల్లో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఆయన ఉన్నారు. దేశంలో అనేక కేసులు ఆర్కేపై ఉన్నాయి. కోటి రూపాయిల రివార్డు కూడా అతనిపై ఉంది. చంద్రబాబుపై దాడి చేసిన కేసులో ఆర్కే ప్రధాన నిందితుడుగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలో జరిపిన చర్చల్లో ఆర్కే ప్రముఖ పాత్ర వహించారు.