Oct 27,2021 20:58

సెన్సెక్స్‌ 207 పాయింట్ల పతనం
ముంబయి : 
దేశీయ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. బుధవారం సెషన్‌లో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 207 పాయింట్లు కోల్పోయి 61,143 వద్ద ముగిసింది. స్టాక్‌మార్కెట్‌ ప్రారంభంలో సూచీలకు మద్దతు లభించినప్పటికీ.. ట్రేడింగ్‌ ముగింపు సమయంలో అనుహ్యాంగా మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. సెన్సెక్స్‌ ఓ దశలో 61,557 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. ఓ దశలో 60,989 కనిష్టానికి పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 18,211 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌-30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎస్‌బిఐ, ఐటిసి, హెచ్‌సిఎల్‌ టెక్‌, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌ సూచీలు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌, ఎన్‌టిపిసి. నెస్లే ఇండియా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. నిఫ్టీలో బ్యాంకింగ్‌ సూచీ 1.1 శాతం విలువ కోల్పోగా.. పిఎస్‌యు బ్యాంకింగ్‌ సూచీ 1.8 శాతం పెరిగింది. ప్రయివేటు బ్యాంకింగ్‌ ఇండెక్స్‌ దాదాపు 2 శాతం విలువ కోల్పోయింది.