Nov 27,2020 22:00

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌: మార్కెట్‌ యార్డుకు వచ్చిన రైతులకు సబ్సిడీ భోజనం కౌంటర్‌ను ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేవలం రూ.15లకే నాణ్యమైన సబ్సిడీ భోజనాన్ని రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఇస్కాన్‌, స్వచ్ఛంద సంస్థ, ప్రభుత్వం ద్వారా వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు వచ్చే రైతులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని చెప్పారు. మార్కెట్‌ యార్డులో ప్రధాన కార్యాలయం సమీపంలో రైతుల విశ్రాంతి భవనం పక్కన ప్రత్యేక భోజనశాలను ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ మహబూబ్‌ బాషా, వైస్‌ చైర్మన్‌ కామాక్షి తిమ్మప్ప, మార్కెట్‌ యార్డు కార్యదర్శి శ్రీకాంత్‌ రెడ్డి, సికిందర్‌ వలీ, మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌లు ఎరుకల రమేష్‌, అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.