Nov 26,2021 08:47

మానకొండూరు (కరీంనగర్‌) : కరీంనగర్‌ జిల్లా మానకొండూరు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. మానకొండూరు పోలీస్‌స్టేషన్‌ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. హుజూరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.