Oct 24,2021 09:10

ముచ్చటైన చిలుక
ముద్దులొలుకు
పలుకులు మాకిష్టం

అందమైన నెమలి
కనువిందు చేయు
నృత్యాలు మాకిష్టం

గానాల కోయిల
తీయనైన గొంతుక
రాగాలు మాకిష్టం

వాన చినుకులు
చిటపటతో రేపు
మట్టివాసనలు మాకిష్టం

లేగ దూడలు
సందడి చేయు
గంతులు మాకిష్టం

చిన్నిపాప పాదాలు
గజ్జెలు చేయు
సవ్వడులు మాకిష్టం

ఆట, పాటలతో
అందరిని అలరించు
పాఠశాలలు మాకిష్టం

- కయ్యూరు బాలసుబ్రమణ్యం
9441791239