Aug 08,2021 12:05

ప్రస్తుతం సినీ పరిశ్రమలో పూజా హెగ్డే హవా కొనసాగుతోంది. స్టార్‌ హీరోల సరసన ఛాన్స్‌ కొట్టేస్తూ.. మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారిపోయింది. అయితే నిత్యం సినిమాలతో బిజీగా ఉండే ఈ కథానాయిక అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ.. సామాజిక మాద్యమాల్లో కనిపిస్తుంది. నిత్యం అభిమానులో సోషల్‌ మీడియాలో ఉంటూ కాంట్రావర్శీలపైనా స్పందిస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌లో కరీనాకపూర్‌ రెమ్యూనరేషన్‌పై నడుస్తున్న కాంట్రవర్శీపైనా స్పందించింది. 'బారుకాట్‌ బెబో' ఇష్యూపై బుట్టబొమ్మ చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

పేరు : పూజా హెగ్డే
పుట్టిన తేదీ : అక్టోబర్‌ 13, 1990
పుట్టిన ప్రాంతం : ఉడుపి, కర్ణాటక
నివాస ప్రాంతం : ముంబై
చదువు : కామర్స్‌లో మాస్టర్స్‌
హాబీస్‌ : రీడింగ్‌, డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌
తల్లిదండ్రులు : మంజునాథ్‌ హెగ్డే, లత హెగ్డే
సోదరులు : రిషబ్‌ హెగ్డే

టాలీవుడ్‌లో బిజీగా ఉన్న హీరోయిన్లలో పూజాహెగ్డే ఒకరు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. 2010లో విశ్వసుందరి పోటీలకు భారత్‌ నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన పూజా, ఆ తర్వాత 2012లో తమిళ సూపర్‌ హీరో సినిమా 'ముగమూడి'తో తెరంగేట్రం చేసింది. 2014లో 'ముకుంద' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అనంతరం ఒక లైలా కోసం, అశుతోష్‌ దర్శకత్వంలో మొహంజదారోలో నటించింది. అనంతరం 'అల వైకుంఠపురంలో' లాంటి బ్లాక్‌ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకుంది. అయితే నిత్యం బిజీ షెడ్యూల్‌లో ఉండే పూజ అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలోనూ కాంట్రవర్శీ ఇష్యూస్‌తో అభిమానుల ముందు ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటుంది.
 

ఆల్‌ అబౌట్‌ లవ్‌ పేరుతో..
పూజాహెగ్డే 'ఆల్‌ అబౌట్‌ లవ్‌' పేరుతో ఇటీవలే ఓ స్వచ్ఛంద సేవా సంస్థనూ స్థాపించింది. తనను ఉన్నత స్థానంలో నిలబెట్టిన సమాజానికి సేవ చేసే లక్ష్యంతో ఈ ఫాండేషన్‌కు శ్రీకారం చుట్టానని పూజా పేర్కొంది. పిల్లలకు వైద్య, ఆర్థికపరమైన సహాయసహకారాలు అందించడమే 'ఆల్‌ అబౌట్‌ లవ్‌' ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేసింది. 'నాదైన పరిధిలో సమాజానికి చేయబోతున్న చిరుసేవ ఇది. చిత్రసీమలో ఒక విజయవంతమైన నాయికగా సమాజంలో మార్పును కాంక్షిస్తూ, ఆశ్రితుల్ని ఆదుకోవాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నా. చిన్నదో.. పెద్దదో.. ఏదో ఒకటి సమాజానికి చేయాలన్నదే నా ఆశయం. ప్రేమ అనేది ఒక శక్తిమంతమైన భావోద్వేగం అని నమ్ముతాను. ప్రేమతో చేసే ఏ సేవ అయినా ప్రపంచంలో మంచి మార్పుకి కారణం అవుతుందని విశ్వసిస్తా' అని పూజాహెగ్డే చెప్పింది. ఈ ఫౌండేషన్‌ స్థాపనకు ముందే తన సొంత పట్టణం మంగళూరులో పలు సేవా కార్యక్రమాల్లో భాగమైంది పూజాహెగ్డే. క్యాన్సర్‌తో బాధపడుతున్న కొందరు చిన్నారుల వైద్య ఖర్చులను భరించడంతో పాటు వందమంది దినసరి కూలీలకు నెలకు సరిపోయే నిత్యావసర వస్తువుల్ని అందించింది. కోమాలోకి వెళ్లిపోయిన ఓ వ్యక్తి కుటుంబ ఆర్థిక అవసరాల్ని తీర్చే బాధ్యతనూ పూజా తీసుకుంది.
 

మాకేం తక్కువ...!
ప్రస్తుతం బాలీవుడ్‌లో రెమ్యూనిరేషన్‌ విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో పూజ కరీనాకు మద్దతుగా నిలిచింది. దీనిపై స్పందిస్తూ.. 'మాకేం తక్కువ.. మేం మాత్రం కష్టపడట్లేదా..? హీరోలు అడిగితే డిమాండ్‌.. మేం అడిగితే యాటిట్యూడ్‌ అని ఎందుకంటారు?' అని ప్రశ్నించింది. పూజా చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి.
     వరుసగా భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నప్పటికీ విరామ సమయాల్ని ఫౌండేషన్‌ కార్యకలాపాల కోసం వెచ్చిస్తానని ఆమె పేర్కొంది. ఇక రరసినిమాల విషయానికి వస్తే.. తెలుగులో 'రాధేశ్యామ్‌', 'ఆచార్య', 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌', తమిళంలో 'బీస్ట్‌', హిందీలో 'సర్కస్‌', సల్మాన్‌ఖాన్‌తో ఒక సినిమా చేస్తున్నారామె. అలాగే ఎన్టీఆర్‌-కొరటాల శివ సినిమాలో, రామ్‌చరణ్‌-శంకర్‌ సినిమాలో, ధనుష్‌-శేఖర్‌కమ్ముల చిత్రంలోనూ పూజా హెగ్డేని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది పూజా.