Oct 13,2021 16:45

లక్నో : గత కొన్నేళ్లుగా, కొంతమంది వ్యక్తులు తనని అత్యాచారం చేశారంటూ ఓ 17 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు తనని 28 మంది అత్యాచారం చేశారని పేర్కొంది. ఈ దారుణాలకు కన్నతండ్రే కారణం కావడం అందరినీ నివ్వెరపరుస్తోంది. ఈ ఘటన ఉత్తప్రదేశ్‌ లలిత్‌పూర్‌ జిల్లాలో నమోదైన కేసు అని ఓ మీడియా సంస్థ పేర్కొంది. బాలిక తెలిపిన వివరాల ప్రకారం..
'మా నాన్న ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు. నేను ఆరోతరగతి చదువుతున్న సమయంలోనే మా నాన్న నాకు అసభ్యకరమైన చిత్రాలను చూపించి లైంగికంగా వేధించేవాడు. లొంగదీసుకోవాలని ప్రయత్నించేవాడు. ఓరోజు నన్ను నమ్మించి, నాకు కొత్తబట్టలు కొనిచ్చి, బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. ఓ నిర్జన ప్రదేశంలో నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే మా అమ్మను చంపేస్తానని బెదిరించాడు. ఇది ఇంతటితో ఆగలేదు. ఈ ఘటన తర్వాత మా నాన్న ఓరోజు నాకు మత్తుమందు కలిపిన అన్నం తినిపించాడు. అది తిని నేను స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత మా నాన్న నన్ను ఓ హోటల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ నాపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నాకు స్పృహ వచ్చేసరికి నా ఒంటిపై బట్టలు లేవు. తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. మా నాన్న ఏదో ఒక సందర్భంలో ఇలా చేయడం జరుగుతూనే ఉంది. ఎవరో ఒక వ్యక్తి రావడం నాపై అత్యాచారానికి పాల్పడడం.. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఒకసారి ఎఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్‌యాదవ్‌ కూడా వచ్చాడు. అతను నాపై అత్యాచారానికి పాల్పడుతుంటే నేను వ్యతిరేకించడంతో.. నీ తండ్రే పంపాడంటూ అత్యాచారానికి పాల్పడ్డాడు. మరోసారి తిలక్‌తోపాటు ఆయన స్నేహితులు, బంధువులు, మా బంధువులు నన్ను ఇలాగే తీవ్రంగా హింసించారు' అంటూ తన దయనీయ పరిస్థితిని పోలీసులకు వెల్లడించింది.
కాగా, తిలక్‌ యాదవ్‌ తనపై వస్తున్న అత్యాచార ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. తనని, తన సోదరలను కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఏది ఏమైనప్పటికీ.. ఆ బాధితురాలు ఎదుర్కొన్న దారుణ పరిస్థితి ప్రతిఒక్కరి హదయాలను మెలిపెడుతోంది.