Apr 11,2021 15:47

కొచ్చి : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన భారత వ్యాపారి, లులూ గ్రూప్‌ల చైర్మన్‌ ఎంఎ యూసఫ్‌ అలీ పెను ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుని బయటపడ్డారు. అలీ, ఆయన భార్య, మరికొంద మందితో ప్రయాణిస్తున్న విమానం కొచ్చిలోని పనన్‌గడ్‌లోని కేరళ యూనివర్శిటీ ఆఫ్‌ ఫిషరీస్‌ అండ్‌ ఓషన్‌ స్టడీస్‌ (కెయుఎఫ్‌ఒఎస్‌) సమీపాన ఓ ఖాళీ ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయింది. ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్‌ అయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఎటువంటి గాయాలు, నష్టం చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు. లులూ పేరుతో భారత్‌లో కూడా ఆయనకు పలు వ్యాపారాలున్నాయి. యూసఫ్‌ ఆయన భార్య.. ఇతరులను అబ్జర్వేషన్‌ నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Chopper Carrying Businessman Makes Emergency Landing In Kerala