మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కుళ్లిన మాంసం.. బూజుపట్టిన కూరగాయలు

08 ఆగస్టు, 2026

food
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 12:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఫైవ్‌‌స్టార్‌ హోటళ్లలో ఆహార భద్రత బృందాల తనిఖీలో వెలుగులోకి..

- బెంగళూరులో కలకలం

బెంగళూరు : కర్ణాటక రాజధాని, ఐటి నగరంగా పేరొందిన బెంగళూరులో కల్తీ ఆహారం కలకలం రేపుతోంది. చిన్నచితకా హోటళ్లు కాదు..ఏకంగా ఫైవ్‌ స్టార్‌ ‌హోటళ్లలో ‌సైతం భారీ స్థాయిలో ఆహారం కల్తీ జరుగుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక ఫుడ్‌ ‌సేఫ్టీ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఎస్‌‌డిఎ) విభాగానికి చెందిన 30 బృందాలు శనివారం నాడు నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి. టాప్‌ ఫైవ్‌ ‌స్టార్‌, త్రీ స్టార్‌‌ హోటళ్లు సహా మొత్తం 26 హోటళ్లలో నిర్వహించిన ఈ తనిఖీల్లో 250 కిలోల కుళ్లిన మాంసం, 207 కిలోల బూజు పట్టిన కూరగాయాలు, 32 లీటర్ల ఔట్‌ ‌డేటెడ్‌ పాలు, బేకరీ ఉత్పత్తులను ‌గుర్తించి వాటిని ధ్వంసం చేసింది. ‌పాఠశాలలు, కాలేజీల చుట్టుపక్కలా జంక్‌ ‌ఫుడ్‌ విక్రయాలపై దాడులు జరిపే క్రమంలో ఈ సోదాలు జరిగాయని ఎఫ్‌ఎస్‌‌డిఎ అధికారులు తెలిపారు. కాలం చెల్లిన ఉత్పత్తులను నిల్వ చేయడం, తప్పడు బ్రాండ్ల పేర్లను వాడడం, సరైన లేబుల్స్‌ ‌లేకపోవడం, మాంస ఉత్పత్తులు నిర్దిష్ట ఆహార ప్రమాణాలకు తగినట్లుగా లేకపోవడం కనిపించిందని పేర్కొన్నారు. అలాగే అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో కిచెన్‌‌లు ఉన్నట్లు తెలిపారు. లలిత్‌ అశోక్‌ (సౌత్‌ అనెక్స్‌)‌, షాంగ్రిలా, ఫోర్‌ ‌సీజన్స్‌, వివంతా వైట్‌‌ఫీల్డ్‌, తాజ్‌ ‌యశ్వంత్‌‌పూర్‌, రాడిసన్‌ ‌బ్లూ సహా పలు ప్రముఖ హోటళ్ళు, రెస్టారెంట్లలో ఇదే పరిస్థితని తెలిపారు. తేయాకు పొడి, చికెన్‌, మటన్‌, చేపలు, వంటనూనెలు, కారం పొడి, పసుపు, టమోటాసాస్‌, లెమన్‌ ‌జ్యూస్‌, చీజ్‌, అప్పడాలు, జీడిపప్పు, అల్లం, మిరియాల పొడి, మసాలా, పాలు ఇలా పలు ఆహార ఉత్పత్తుల్లో కల్తీ జరిగినట్లు గుర్తించామన్నారు. వీటిని లేబరేటరీ పరీక్షకు పంపించామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్