Nov 25,2021 21:13

గాలే: రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో శ్రీలంక జట్టు 187 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తుచేసింది. 348 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన వెస్టిండీస్‌ జట్టు 160 పరుగులకు కుప్పకూలింది. బోనర్‌(68), జోషూాడాశిల్వ(54) అర్ధసెంచరీలు చేయగా.. మిగతావారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. లసిత్‌(4/43), రమేశ్‌ మెండీస్‌(5/67) బౌలింగ్‌లో మెరిసారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 386 పరుగులు చేయగా.. వెస్టిండీస్‌ జట్టు 230 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 191 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కరుణరత్నేకు దక్కింది.