Dec 03,2021 07:53
  • 1,977 మందికి చెల్లింపులు
  • 8,173 మంది నుండి ధాన్యం కొనుగోలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల సంస్థ చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. ఇప్పటి వరకు 774 రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బికె)ల ద్వారా (డిసెంబర్‌ 2 సాయంత్రం 4గంటల వరకు) 97,173 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 664 మండలాల నుండి ధాన్యం సేకరణ చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 123 మండలాల్లో సేకరణను ప్రారంభమైంది. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో సతమతమైన నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లోనూ ధాన్యం సేకరణ మొదలైంది. నెల్లూరులో 262, పశ్చిమ గోదావరిలో 290, తూర్పుగోదావరిలో 161, కృష్ణాజిల్లాలో 59, శ్రీకాకుళం, కడపలో ఒక్కొక్కటి చొప్పున ఆర్‌బికెలు ధాన్యాన్ని సేకరించాయి. నెల్లూరులో అత్యధికంగా 52,734, పశ్చిమగోదావరిలో 31,817మెట్రిక్‌ టన్నులు, తూర్పుగోదావరిలో 8,978 మెట్రిక్‌ టన్నులు, కృష్ణాజిల్లాలో 3,642 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ సేకరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంజిల్లాల్లో మార్క్‌ఫెడ్‌ ధాన్యం సేకరిస్తోంది. గురువారం ఒక్కరోజే 7,183 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు. ఇప్పటి వరకు 8,173 మంది రైతుల నుండి ఆర్‌బికెలు ధాన్యాన్ని సేకరిం చాయి. వీరిలో 1,977 మందికి చెల్లింపులు పూర్తయ్యాయి. మరో 6,300 మందికి చెల్లింపులు చేయాల్సి ఉంది. 21రోజులు గడువు పూర్తయిన రైతులకు చెల్లింపులు ఇప్పటి వరకు చెల్లింపులు పూర్తయ్యాయి. ఆధార్‌ ఆధారిత చెల్లింపులను పౌరసరఫరాల సంస్థ ఈ సంవత్సరం చేపట్టడంతో, ఎటువంటి ఆటంకం లేకుండా చెల్లింపులు సజావుగా కొనసాగుతున్నా యని ఆర్‌బికె అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం విలువ రూ.189.62 కోట్లుగా ఉంది. వర్షాల దృష్ట్యా ధాన్యంలోని తేమ శాతంపై మినహాయింపులకు సంబంధించి పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతు న్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారుల నుండి అధికారికంగా ప్రక టన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

                                                        చెల్లింపులు సకాలంలో పూర్తి..

''రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. ఇప్పటికే లక్ష మెట్రిక్‌ టన్నులు పూర్తి అయ్యింది. శ్రీకాకుళం, కడపలోనూ ఈ వారంలో ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ యేడాది ఆధార్‌ ఆధారిత చెల్లింపులు చేస్తున్నాము. ఇది మంచి ఫలితాలు ఇస్తోంది. ఇప్పటి వరకు ఆధార్‌ ఆధారిత చెల్లింపులు రూ.3.68 కోట్లు పూర్తిచేశాం. ధాన్యం సేకరించిన 21రోజులు పూర్తయిన రైతులకు సకాలంలో చెల్లింపులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తి ప్రణాళికతో ఉంది. రైతులు ఎవరూ తక్కువ రేటుకు తమ ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవద్దు. ఆర్‌బికెల వద్ద మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాలని కోరుతున్నాం. గోనె సంచులకు సంస్థ వద్ద ఎటువంటి కొరత లేదు ''
                                              - జి వీరపాండ్యన్‌,

                                   ఎపి పౌరసరఫరాలసంస్థ ఎమ్‌డి