Mar 02,2021 21:41

ర్యాలీ నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బంది

ప్రజాశక్తి - రాయచోటి :లింగ నిర్దారణ పరీక్షలు చేయడం నేరమనీ, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యండపల్లె ప్రాథ మిక వైద్యాధికారి డాక్టర్‌ బి.సునీల్‌కుమార్‌ నాయక్‌ అన్నారు. మంగళ వారం యండ పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఆశాడే సమావేశ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లింగ వివక్షతతో పురుషులు, స్త్రీల నిష్పత్తి 1000:831కి స్థాయి కి చేరడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్‌ సెంటర్ల సమాచారాన్ని తెలియజేయాలని సిబ్బందిని కోరారు. ఈ సంద ర్భంగా ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో సిహెచ్‌ఒ కె.భాగ్యలక్ష్మి, ఎంపిహెచ్‌ఇఒ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి, మహిళ హెల్త్‌ సూపర్‌ వైజర్‌ జి.రవణమ్మ, హెల్త్‌ అసిస్టెంట్లు యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి, ఎస్‌.ఖాదర్‌ బాష, బి.నిర్మలమ్మ, టి.సుజాత, రోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.