
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు కోటికి దగ్గరకు చేరువయ్యాయి. ఇప్పటికే 92 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే తొలినుండి పలువురు శాస్త్రవేత్తలు ఇంకా కేసులు ఎక్కువగానే ఉండవచ్చునన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అదే వాస్తవమైంది. కాగా, తాజా నివేదికల ప్రకారం 34 లక్షల కేసులు లెక్కలోకి రాలేదని తేలింది. ఈ అవకతవకలకు జరగడానికి ప్రధాన కారణాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,, తెలంగాణా హైకోర్టు ఎత్తి చూపుతున్న స్క్రీనింగ్ టెస్ట్. ఈ టెస్ట్‌ల సంఖ్య భారత్ తగ్గించడం వల్ల ఇవి లెక్కలోకి రాలేదు. రెండవది యాంటిజెన్ పరీక్షల సంఖ్యను పెంచడం, పిసిఆర్ పరీక్షల సంఖ్యను తగ్గించటం.
ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ కూడా యాంటిజెన్ పరీక్షలు కోవిడ్ ఉన్నట్లు నిర్ధారించలేవు. తక్కువ వైరస్ లక్షణాలు వున్న వ్యక్తులకు స్క్రీనింగ్‌లో ఏమీ తెలియడం లేదు. అదేవిధంగా రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు (రాట్) అధిక సంఖ్యలో తప్పుడు నివేదికలు ఇచ్చే అవకాశాలున్నాయి. దీని కారణంగానే కరోనా వాస్తవ లెక్కలు తేలలేదు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు కూడా రాట్ విషయములో ఆప్ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది.
పిసిఆర్ వర్సెస్ యాంటిజెన్ ఫలితాలపై కొన్ని రాష్ట్రాలు మాత్రమే నివేదించిన డేటా ప్రకారము...కరోనా ఫలితాన్ని తేల్చడంలో పిసిఆర్ పరీక్షలు మెరుగ్గా ఉన్నాయని తేలింది. యాంటిజెన్ పరీక్షల కన్నా పిసిఆర్ పాజిటివిటీ రేేటు 2.5-3.5 రెట్లు సత్ఫలితాన్నిస్తున్నాయి. ఢిల్లీలో పిసిఆర్ టెస్ట్‌ల పాజిటివిటి రేటు 14 శాతం ఉండగా, యాంటి జెన్ పరీక్షలు 4 శాతం మాత్రమే. కరోనా వచ్చిన తొలినాళ్లలో 100 శాతం పిసిఆర్ పరీక్షల ద్వారానే రోగ నిర్ధారణ జరగ్గా..ఇప్పుడు వాటి సంఖ్యను 60 శాతానికి పడిపోయింది. అదే సమయంలో యాంటిజెన్ పరీక్షల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఈ ఏడు నెలల కాలంలో ఆ పరీక్షల సంఖ్య 5.5 కోట్లకు చేరింది. అంటే ఇప్పటి వరకు జరిగిన మొత్తం పరీక్షల్లో 40 శాతమన్నమాట. దీని ప్రకారము... కోవిడ్ వచ్చిన వారికి సరైన ఫలితాలు కూడా వచ్చి ఉండకపోవచ్చు అన్న అభిప్రాయము ఏర్పడుతుంది. ఒక్క ఢిల్లీలోనే కాదూ ప్రతి రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి.
పేలవమైన టెస్టింగ్‌లు
బీహార్, తెలంగాణా, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లు 50 శాతం కన్నా తక్కువగా పిసిఆర్ పరీక్షలు నిర్వహించిన చెత్త రాష్ట్రాలుగా నిలిచాయి. తెలంగాణాలో కేసులు తక్కువగా నమోదు ఎందుకు అవుతున్నాయో ఈ క్రమంలో తెలుసుకునేందుకు ఉపయోగపడింది. ఈ ఐదు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కొంచెం మెరుగ్గా..ఉంది. 59 శాతం పిసిఆర్ పరీక్షలను నిర్వహించింది. దేశ సగటు 58 శాతానికి ఒక శాతం ఎక్కువ పరీక్షలు నిర్వహించింది. రాజస్తాన్, తమిళనాడులో 100 శాతం పరీక్షలు కేవలం పిసిఆర్ ఆధారంగానే జరిగాయి. అందుకు అక్కడి ఫలితాలు పారదర్శకంగా వున్నాయి.
లెక్కలోని రానివి
యాంటిజెన్ పరీక్షలను పెద్ద మొత్తంలో నిర్వహించడం ద్వారా కోవిడ్ కేసులు అంతే సంఖ్యలో బయటపడలేదు. అదేవిధంగా బీహార్ అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన రాష్ట్రంగా నిలిచింది. బీహార్ కోవిడ్ కేసులను 132 శాతం తక్కువ చేసి చూపించగా, తెలంగాణా 123 శాతం, గుజరాత్ 109 శాతం, ఆంధ్ర 37 శాతం కేసులను తక్కువగా చేసి చూపాయి. మొత్తంగా జాతీయ సగటు 39 శాతంగా వుంది.
పెద్ద మొత్తంలో బయటపడని కోవిడ్ కేసులు
కోవిడ్ కేసులు అధికారిక లెక్కల సంఖ్య ఆ నిర్థిష్ట రాష్ట్రంలోని మొతం జనాభా, రాష్ట్రంలో కోవిడ్ వ్యాధి వ్యాప్తి, నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల సంఖ్యపై ఆధారపడి వుంది. పైన పేర్కొన్న దాని ప్రకారము చూస్తే అత్యధిక జనాభా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీలో 10 లక్షలకు పైగా కేసులు రికార్డు కాలేదు. రాజస్తాన్, తమిళనాడు, పంజాబ్ పారదర్శకమైన నివేదికలు ఇచ్చాయి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 3.2 లక్షల కేసులను తక్కువ చేసి చూపించాయి.
పారదర్శకంగా పరీక్షలను నిర్వహించిన రాష్ట్రాలు :
పిసిఆర్ పరీక్షల ఆధారంగా , జనాభాను బట్టి చూస్తే తమిళనాడు టాప్ స్థానంలో వుంది. ఏ రాష్ట్రంలోనూ లేనన్ని పరీక్షలను అంటే కోటికి పైగా పరీక్షలను నిర్వహించింది. మరే రాష్ట్ర్రము ఈ సంఖ్యకు దగ్గరగా చేరుకోలేదు. తమిళనాడులో ప్రతి పది వేల మందిలో 1400 మందికి పిసిఆర్ ద్వారా ...వాస్తవమైన పరీక్షలు చేయబడ్డాయి. ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక నిలిచింది. ఇది 1300 మందికి పరీక్షలు నిర్వహించింది. తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ వుంది. ఇప్పటి వరకు 54 లక్షల పిసిఆర్ టెస్ట్‌లు చేపట్టింది. ప్రతి పదివేల మందిలో 993 మందికి పరీక్షలు నిర్వహించింది.
తక్కువగా పేర్కొన్న పాజిటివిటీ రేటు
తక్కువ పిసిఆర్ పరీక్షలు నిర్వహించడం వల్ల రాష్ట్రాల్లో తక్కువ కేసులు నమోదు అయ్యాయి. వాస్తవంగా చెప్పాలంటే పాజిటివిటీ రేటు నివేదించిన దాని కన్నా ఎక్కువ. ప్రసుతం ఈ లెక్కల ప్రకారం పేర్కొంటున్న పాజిటివిటీ రేటులో ..దాదాపు 140 శాతం ఉండవచ్చు.