Sep 15,2021 19:28

విజయ్ హీరోగా, దర్శకుడు పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'లైగర్‌'. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కానుంది. లాక్‌డౌన్‌లో వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమైందని హీరో సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. గోవాలో చిత్రీకరించనున్న యాక్షన్‌ సన్నివేశాల కోసం చిత్రబృందం భారీ సెట్‌ను ఏర్పాటు చేసింది. అక్కడ బాక్సింగ్‌ రింగ్‌లో విజరు కూర్చుని ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో ఉంచారు.