Jan 15,2022 10:48

ఉంగుటూరు (పశ్చిమ గోదావరి) : రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొనడంతో 10 మందికి గాయాలయిన ఘటన శనివారం తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు జంక్షన్‌ వద్ద చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వైపు 25 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు భీమడోలు జంక్షన్‌ వద్దకు రాగానే రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారిని 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న భీమడోలు ఎస్‌ఐ వీరభద్రరావు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.